మందమర్రి ఘటనలో నలుగురి రిమాండ్
మేకను ఎత్తుకెళ్లాడనే నెపంతో దళితులను చిత్రహింసలకు గురిచేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకా రం..
మందమర్రి, సెప్టెంబర్ 3 : మేకను ఎత్తుకెళ్లాడనే నెపంతో దళితులను చిత్రహింసలకు గురిచేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకా రం.. మందమర్రిలోని యాపల్ ఏరియాకు చెందిన రాములు-స్వరూప దంపతులతోపాటు వారి కుమారుడు శ్రీనివాస్ అదే ఏరియాలో షెడ్డు నిర్మించి మేకలు పెంచుతున్నారు. ఇటీవల మందలో నుంచి ఓ మేక కనిపించకుండా పోయింది. మేకను దొంగతనం చేశారనే అనుమానంతో ఈ నెల ఒకటిన అదే ప్రాంతానికి చెందిన కిరణ్, తేజను షెడ్డుకు పిలిపించారు.
పైవాసానికి తాడుతో వేలాడదీసి కొట్టగా, మొదట షెడ్డులోని ఇనుప పైపు ను దొంగతనం చేసినట్టు ఒప్పుకొన్నారు. పైపును దాచిన ప్రదేశాన్ని చూపెట్టడంతో అక్కడ నుంచి పైపును తీసు కువచ్చారు. మేక ను కూడా ఎత్తుకెళ్లారంటూ ఆ ఇద్దరిని షెడ్డు పైవాసానికి వేలాడదీసి కింద మంట పెట్టి మరోసారి చిత్రహింసలకు గురిచేయగా, తామే దొంగతనం చేసినట్టు అంగీకరించారు. తేజ తల్లి, కిరణ్ చిన్నమ్మ వచ్చి డబ్బులు చెల్లిస్తామని చెప్పి వారిని విడిపించుకెళ్లింది. ఆ తరువాత ఆమె శనివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి రాములు, స్వరూపతోపాటు వారి కుమారుడు శ్రీనివాస్‌ను శనివారం రాత్రి అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మంచిర్యాల కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులకు సహకరించిన నరేశ్‌ను ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఏసీపీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

