గద్వాల అర్బన్, మార్చి 30 : బల్లి పడ్డ చట్ని తిని నలుగురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్లో చట్నిలో బల్లి పడింది. అది గమనించని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు టిఫిన్ కోసం వచ్చిన పలువురికి చట్ని వడ్డించగా అందులో చనిపోయిన బల్లి బయట పడింది.
అనంతరం కొంత సమయానికే నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్‌కుమార్ దవాఖానకు వెళ్లి వారి వివరాలు తెలుసుకున్నారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెల్లడించారు.