పరిగి, మే 20 : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో బస్సు లో ఉన్న వారిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 31 మందికి గాయాలయ్యాయి.
వివరాలు ఇలా.. పరిగికి చెందిన అమ్మాయికి షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన అబ్బాయితో ఈనెల 16న వివాహం జరిగింది. సోమవారం రాత్రి పరిగిలోని అమ్మా యి వారి ఇంట్లో విందు ఉండగా అబ్బాయి కుటుంబసభ్యులు, బంధువులు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలప్పుడు రంగాపూర్ స్టేజీ దాటిన తర్వాత జాతీయ రహదారిపై ఉన్న సిమెంట్ లోడ్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెనుకనుంచి ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో షాబాద్ మం డలం చిన్న సోలిపేటకు చెందిన బాలమణి (60), సీతారాంపూర్ వాసి ము త్యాల మల్లేశ్ (26), ఫరూక్నగర్ మం డలం కిషన్‌నగర్‌కు చెందిన మంగళి సం దీప్(28), చేవెళ్ల మండలం రావులపల్లివాసి హేమలత(30) మరణించారు. మరో 31 మందికి గాయాలు కాగా వారిలో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి. బస్సులో ఇరుక్కున్న పలువురిని పోలీసులు కష్టపడి బయటకు తీశారు.
ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంపై పరిగి ఎమ్మెల్యే టీ రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.