Road Accident | ఎర్రవల్లి చౌరస్తాలో కారు-లారీ ఢీ.. బాలుడు సహా నలుగురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. మృతులను వెంకటేశ్ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

