హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ) : చిట్‌ఫండ్ పేరిట హైదరాబాద్‌లో 1,300 మందిని మోసగించి, రూ.70 కోట్లు కొల్లగొట్టిన నలుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల్లో చవ్వా కుమార్ (50), చవ్వా యాదగిరి (62), చవ్వా చిన్న ఇస్తారి (60), చవ్వా వెంకటేశ్ (58) ఉన్నారు. నల్లకుంటకు చెందిన పాశం వేణుగోపాల్‌రెడ్డి 2022లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టులు జరిగాయి. వీరంతా శంకర్‌పల్లిలో వీరభద్రీయ పరపతి సహకార సంఘం పేరిట చిట్‌ఫండ్ వ్యాపారాన్ని నడిపారు. వీరి చేతిలో మోసపోయినవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విచారణకు సహకరించాలని అధికారులు కోరారు.