మహబూబాబాద్, ఏప్రిల్ 24: ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడిన నలుగురు యువకులను సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5.5 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు మహబూబాబాద్ టాస్క్‌ఫోర్స్ సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కేసులో ఖమ్మం నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన తొట్టెంపూడి విక్రమ్, గుంటూరు ఆనంద్ కిరణ్, ముస్తాఫానగర్‌కు చెందిన దాన ప్రవీణ్‌కుమార్, ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన రామకృష్ణను అరెస్టు చేసినట్టు సీఐ పేర్కొన్నారు.