హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తొలి ప్రమోటర్, గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్‌జెన్‌కు గురువారం ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. మలివిడత విచారణలో భాగంగా సీజన్-9 రేస్‌కు ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ నష్టాలను చూపుతూ సీజన్-10 నుంచి తప్పుకున్నది. ఇటీవల గ్రీన్కో, ఏస్ నెక్ట్స్‌జెన్ కంపెనీల్లో ఏసీబీ అధికారులు సోదాలు సైతం నిర్వహించారు.