హన్వాడ, సెప్టెంబర్ 10: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఖర్చులకు గాను హన్వాడ మాజీ జెడ్పీటీసీ నరేందర్ దంపతులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోనిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి నరేందర్ దంపతులు రూ.1,11,111 చెక్కు అందించారు. ముచ్చటగా మూడోసారి 1,11,111 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.