హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు తన సతీమణితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి సలీంనగర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటువేశారు. కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటువేశారు. ఇక పులివెంబులు బాకరాపురంలో ఏపీ సీఎం జగన్, గుంటూరు జిల్లా ఉండవల్లిలో సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కరీంనగర్‌లోని ఓల్డ్ హైస్కూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, అలంపూర్‌లో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తన స్వగ్రామమైన గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, మాదాపూర్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, నల్లగొండలో జిల్లా కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, కుందన్‌బాగ్‌లోని చిన్మయా స్కూల్లో అదనపు డీజీ మహేశ్ భగవత్, గోపన్‌పల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గోపన్‌పల్లిలో ఓటువేశారు.