Pallam Raju | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తన సోదరుడి స్పోర్ట్స్ వెంచర్‌ను అక్రమ నిర్మాణం పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేడయం బాధాకరమని మాజీ కేంద్రమంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు. ప్రజాజీవితంలో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్న తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉంద న్నారు.
తన సోదరుడు ఆనంద్ 7 ఎకరాలు భూమి లీజుకు తీసుకొని స్పోర్ట్స్ వెంచర్ (ఆర్వోఆర్) ఏర్పాటు చేశారని, ఇందుకోసం తీసుకున్న అను మతులను పరిగణనలోకి తీసుకోకుం డా, నోటీసు లేకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్వోఆర్ 2015 నుంచి పనిచేస్తున్నదని, ఆనంద్ కష్టపడి సంపాందించిన డబ్బులతో దీన్ని ఏర్పాటు చేశారని పల్లంరాజు ఎక్స్‌లో పోస్టు చేశారు.