కోరుట్ల, జూన్ 11: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తాజాగా ఇంటర్మీడియ ట్ పరీక్ష పాసయ్యారు. గతంలో పెండింగ్ ఉన్న సెకండియర్ తెలుగు పరీక్ష రాసి.. 72 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. 1983-85 విద్యా సంవత్సరం లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన, అదే సమయంలో విప్లవ భావజాలానికి ఆకర్షితులై సెకండియర్ తెలుగు పేపర్‌ను రాయలే దు. ఇటీవల జనజీవనంలోకి అడుగుపెట్టి న ఆయన.. గతనెల 13న కోరుట్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పరీక్ష రాశారు.
గురువారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీ క్ష ఫలితాలు విడుదల కాగా, 72 మారు లు సాధించి ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ఇంటర్లో 614 మారులతో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. 43 ఏండ్ల తర్వాత గన్ను వదిలి పెన్ను పట్టిన దేవ్‌జీ, ఇటీవల లాసెట్ ఎంట్రెన్స్ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో 349 ర్యాంకుతో సత్తాచాటడం విశేషం.