KTR | లండన్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని యూకే వ్యాప్తంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని, తెలంగాణ ప్రజలకు సమర్థ నాయకత్వం అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రజా సేవలో మరింత శక్తి, విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ, యూకేలోని ఎన్నారైల తరపున కేటీఆర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే లెస్టర్ పట్టణ ఇంచార్జ్ సాకేత్ రావు కాచవరపు ఆధ్వర్యంలో, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ముఖ్య అతిథిగా పాల్గొని, “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఉపాధ్యక్షుడు రవి రేతినేని తెలిపారు. అదేవిధంగా లండన్లో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారమని ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తెలిపారు.
సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చే కేటీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని ఉపాధ్యక్షుడు సత్య చిలుముల తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలు, వేడుకల ద్వారా విజయవంతంగా నిర్వహించిన యూకే వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సభ్యులందరికీ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేని, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల & గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, గణేష్ పాస్తం, కోశాధికారి సురేష్ బుడగం, సెక్రటరీ మల్లా రెడ్డి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కార్యదర్శి – యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, మెంబర్షిప్ కో ఆర్డినేటర్: అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, నర్సింగ రావు, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, జనార్ధన్ దమ్మక్కపల్లి, హరికృష్ణ మామిళ్ల, అబ్దుల్ కుదుస్, లెస్టర్ ఇంచార్జ్ సాకేత్ కాచవరపు టాక్ సంస్థ సభ్యులు పవిత్ర రెడ్డి, సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని పాల్గొన్నారు.




Ktr5

CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు