చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఏడోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకే అభ్యర్థి పి. వెంకటరామనన్ చేతిలో ఓడిపోయారు. 2019లో తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె డీఎంకే నేత కరుణానిధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నాలుగు నెలలకే తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు.
అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సైతం చేశారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై 2009లో లోక్సభ ఎన్నికల్లో చెన్నై నార్త్ నియోజకవర్గం నుంచి, 2011లో వేలచేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2024లో చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వరుసగా ఏడు ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.