చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ఓ ఆటోడ్రైవర్ సంచలన విజయం సాధించాడు. రాయపురం నుంచి పోటీచేసిన టీవీకే పార్టీకి చెందిన కె. విజయ్ దాము తన ప్రత్యర్థులైన అన్నాడీఎంకే, డీఎంకేకి చెందిన బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలను మట్టికరిపించాడు.
రాయపురం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డి. జయకుమార్, డీఎంకే నుంచి మాజీ మంత్రి రహ్మాన్ ఖాన్ కొడుకు సుబైర్ ఖాన్ బరిలో నిలిచారు. మొత్తం 55000 ఓట్లు సాధించిన విజయ్ దాము తన ప్రత్యర్థులపై 14000 ఓట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.