హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక హకులను కాలరాయడమే కాంగ్రెస్ పాలనగా మారిందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వానికి గుర్తుచేస్తూ వార్త ప్రజానీకానికి చేరవేసినందుకు జర్నలిస్టు రేవతిని అక్రమ అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై జర్నలిస్టులు మాట్లాడకుండా చేసి హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
అక్రమ అరెస్టులను ఖండించాలి: సుమిత్రానంద్
రైతు ఆవేదనను ప్రసారం చేసినందుకు జర్నలిస్టులు రేవతి, తన్వీను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తెలిపారు. ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యం ఇచ్చిన హకులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమా? అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టును ఖండిచాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.