పాన్గల్, జనవరి 29: తన హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా నేటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ శాంతమ్మ వాపోయారు. బుధవారం ఆమె వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు.
తండాలో వివిధ పనులు చేపట్టినా బిల్లులు మంజూరు కాలేదని విచారం వ్యక్తంచేశారు. పనుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.12 లక్షలు అప్పు చేశానని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, బిల్లులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.