హనుమకొండ, ఏప్రిల్ 21 : పెండింగ్ బిల్లులు చెల్లించాలని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నడికూడ మాజీ సర్పంచ్ ఊర రవీందర్రావు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపాడు. అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16నెలలు కావస్తున్నా ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. బిల్లుల విడుదల కోసం ఎన్నిసార్లూ విన్నవించిన పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల కాకపో వడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లిం చకలేక తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి ఈనెల 27లోగా ప్రభుత్వం నుంచి బిల్లులపై ప్రకటన వచ్చేలా ఒత్తిడి తేవాలని మాజీ సీఎం కేసీఆర్ను కోరారు.