మల్లాపూర్, మార్చి 17: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో వంద శాతం రుణమాఫీ కోసం రైతులు పోరుబాట పట్టారు. రైతులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ వనతడపుల నాగరాజు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం రుణమాఫీ అయ్యేంత వరకు రైతులతో కలిసి పోరాడుతామని స్పష్టంచేశారు. ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ గ్రామంలో 300 మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్ చేశారు.