బాన్సువాడ, జనవరి 16: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై స్పీకర్ నిర్ణయం చట్టసభ గౌరవాన్ని దిగజార్చిందని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. పోచారం పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సభాపతి తీర్పునివ్వడం శోచనీయమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోచారం కాంగ్రెస్లోకి ఫిరాయించినప్పటికీ అనర్హత వేటు వేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో స్పీకర్ నిర్లక్ష్యం.. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నదని పేర్కొన్నారు.