హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) పూర్వ అధ్యక్షుడు సీనయ్య సూచించారు. గురువారం బీఏఐ ఆధ్వర్యంలో రాష్ట్ర, సెంటర్ చైర్మన్ల పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడం తప్పనిసరి అని సూచించారు.
కొత్తగా ఎన్నికైన బీఏఐ రాష్ట్ర చైర్మన్ వీ రవీందర్‌రెడ్డితోపాటు 20 మంది సెంటర్ చైర్మన్లతో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వీ సత్యమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈవెంట్ చైర్మన్‌గా వీ సుధాకర్, కో చైర్మన్‌గా ఎస్ శ్రీనివాస్‌రావు వ్యవహరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్లు ఎన్ సచితానంద రెడ్డి, డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర మాజీ చైర్మన్లు యూ సురేందర్, కే దేవేందర్ రెడ్డి, వీ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.