హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఏపీ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసా ర భారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్యశర్మ(80) ఆరోగ్య సమస్య లు, వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కేఎస్ శర్మ మృతిపై పలువురు సంతాపం వ్యక్తంచేశారు.
కేఎస్ శర్మ గతంలో కరీంనగర్ కలెక్టర్‌గా, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా, ఆ తర్వాత ప్రసార భారతి సీఈవోగా, శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ వ్యవస్థాపక సీఈవోగా, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కార్యాలయంలో ముఖ్య అధికారిగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా, నవోదయ విద్యాలయాల స్థాపకుడిగా సేవలు అందించారు. దూరదర్శన్ డైరె క్ట్ టు హోమ్, డీడీ డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టడంలో శర్మ కీలక పాత్ర పోషించారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు.