ఖమ్మం : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు. ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు, యువకులు, మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు.
మంగళవారం ఉదయం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడంతో ఓ యువకుడికి చెయ్యి విరిగింది. మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రులను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(Hospital)కి తరలించి చికిత్స అందిస్తుండగా చల్లా శశి అనే యువకుడు పరిస్థితి విషమించడం(Serious)తో మెరుగైన వైద్య సేవల కొరకు హైదరాబాద్ కు తరలించారు.