బిజినేపల్లి సెప్టెంబర్ 3: రైతుల పంట పొలాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందున నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోవారం రోజులపాటు నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు గురువారం విద్యుత్ కార్యాలయాల ముట్టడించామని తెలిపారు. రైతుల పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నిరంతరం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విమర్శించారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు కూడా సక్రమంగా లేదని అన్నారు. సరైన కరెంటు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్ని చేస్తామని దొంగ హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ రైతుబంధు రైతు బీమా సబ్సిడీపై విత్తనాలు ఎరువులు కరెంటు వంటివి అందించడంలో విఫలమైందన్నారు. కానీ పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రైతులకు అన్ని వసతులను కల్పించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి బాలస్వామి నరేందర్ రెడ్డి శ్రీనివాసులు అల్లోజీ తిరుపతయ్య శివ రాజు వెంకటయ్య గఫూర్ తిరుపతిరెడ్డి కుర్మయ్య తదితరులు ఉన్నారు.