హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (78) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె చెన్నైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మాగుంట పార్వతమ్మ 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004లో కావలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. పార్వతమ్మ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.