హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి శ్రీధర్‌బాబు పేచీలో ఉన్న ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీ సిబ్బంది త క్షణ వైద్య సహాయం అందించి, గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు.