హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానంలో 77 ఏండ్ల సుదీర ్ఘ పోరాట చరిత్ర ఎస్టీయూ సొంతమని ఆ సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు.
ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో సంఘం బాధ్యులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధానకార్యదర్శి జీ సదానంద్గౌడ్, ఆట సదయ్య, సీ రమేశ్, అవంచ సుధాకర్, పున్న గణేశ్, కృష్ణారెడ్డి, గజేందర్, శ్రీధరరావు, శీతల్చౌహన్ పాల్గొన్నారు.