e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home తెలంగాణ మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత

  • నేడు నారాయణపేట జిల్ల్లా తీలేరులో అంత్యక్రియలు

బంజారాహిల్స్‌/ మరికల్‌, మార్చి 7: అమరచింత మాజీ ఎమ్మెల్యే, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొల్లికుదురు వీరారెడ్డి (74) గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాలనీలో నివాసం ఉంటున్న వీరారెడ్డిని పదిరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చేర్పించారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వీరారెడ్డి సతీమణి రేవతమ్మ ప్రస్తుతం నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం తీలేరు సర్పంచ్‌గా ఉన్నారు. వీరారెడ్డికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు స్వగ్రామమైన తీలేరులో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత

ట్రెండింగ్‌

Advertisement