నారాయణఖేడ్, నవంబర్ 11: రాజకీయ చాణక్యుడిగా పేరొందిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావును కలిసిన విజయపాల్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విజయపాల్‌రెడ్డి.. 1994లో టీడీపీ నుంచి నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ప్రస్తుత ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి స్వయాన సోదరుడైన విజయపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉంది. ఆయన బీఆర్ఎస్లో చేరడం నారాయణఖేడ్ రాజకీయాల్లోనే అనూహ్య మలుపు
తిరిగింది. ఈ పరిణామంతో రాజకీయ సమీకరణాలు మారి బీఆర్ఎస్ విజయం మరింత సులువు కానుంది. విజయపాల్‌రెడ్డి 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన వైపు అడుగులేసిన ప్రస్తుత ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో మహారెడ్డి కుటుం బం విడిపోయింది. ఇప్పుడు విజయపాల్‌రెడ్డి చేరికతో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో.. మరీ ముఖ్యంగా మహారెడ్డి కుటుంబ అభిమానుల్లో నూతనోత్సాహం నిండింది.