హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రజల నుంచి వస్తున్న స్పం దన చూస్తుంటే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువడం ఖాయంగా కనిపిస్తున్నదని ముల్కనూరు సహకార సంఘం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముల్కనూరు సొసైటీలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి భేటీ అయ్యా రు. హుజూరాబాద్ నియోజకవర్గ రైతు లు, ఇతర వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు టీఆర్ఎస్ బలంగా ఉన్నదని, ప్రజలంతా టీఆర్ఎస్తోనే ఉన్నారని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పంటల మార్పిడి అంశం చర్చకు వచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు, వ్యవసాయ, సహకార రంగ నిపుణులతో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉన్నదని ఇద్ద రూ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ఎంసీఆర్హెచ్ఆర్డీలో రైతులు, నిపుణులతో చర్చా గోష్టి నిర్వహించాలనన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ భేటీలో ముల్కనూరు సర్పంచ్ కొమురయ్య, మాజీ సర్పంచ్ భీంరెడ్డి పాల్గొన్నారు.