కొడంగల్, ఫిబ్రవరి 11: మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కొడంగల్లో ‘చలో నల్లగొండ’ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధికి రూ.950 కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడం చాలా బాధాకరమని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న నల్లగొండలో చేపట్టిన సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.