హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కురుచబుద్ధిని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ఆరోపించారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అంటే అమరవీరులు, ఉద్యమకారులకు జరిగిన తీవ్ర అవమానంగానే భావిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. చిల్లర చేష్టలతో ఇలాగే రాష్ట్రాన్ని పాలిస్తే చరిత్రహీనుడిగా రేవంత్ మిగిలిపోతారని విమర్శించారు.