హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్‌రెడ్డే ఉన్నాడనే విషయం తేలిపోయిందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ స్పష్టంచేశారు. కవిత వైఖరిపై ఆయనెందుకు గానం చేస్తున్నారు? ఎందుకు వంత పాడుతున్నారు? అని శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
నరంలేని నాలుక ఉన్నోడిలా రేవంత్‌రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష పార్టీ నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురిగా, ఆమెపై ఇంకా గౌరవం ఉంటుందని, దానిని కాపాడుకోవాలని కవితనుద్దేశించి ఆయన పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకులు మృతి!