కాగజ్నగర్ ఎస్పీఎం కాలనీ, మార్చి 13: ‘బీఆర్ఎస్లో పదేండ్ల పాటు పనిచేశా. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. కానీ గత ఎన్నికల్లో నా ఓటమికి కారణమైన బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకే కార్యకర్తల నిర్ణయం మేరకు గురువారం కాంగ్రెస్లో పార్టీలో చేరుతున్నా’ అంటూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కోనేరు కోనప్ప నివాసంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోనప్ప మాట్లాడారు. బీఆర్ఎస్తో గానీ, మాజీ సీఎం కేసీఆర్తో గానీ ఎటువంటి విభేదాలు లేవని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పారు.