పెద్దపల్లి టౌన్ నవంబర్ 16: పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు(Vijayaramana Rao)పై ఈడీ(Enforcement Directorate), ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్‌రావు(Gone Prakash Rao) తెలిపారు. గురువారం పెద్దపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన ఆరోపణలు చేశారు. విజయరమణారావుకు సింగపూర్, హంకాంగ్, జర్మనీ దేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నాయని. అక్కడ పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు.
విదేశాల్లో బ్యాంక్ అకౌంట్ తీయాలంటే ఆ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆన్లైన్లో అకౌంట్ తెరుచుకోవచ్చాని అన్నారు. 2018,2023 సంవత్సరాల్లో వేర్వేరు పాన్ కార్డు నంబర్లు ఎందుకు ఇచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎన్నిసార్లు గాని వివరాలు, అడ్రస్ మార్చుకోవచ్చునన్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో నంబర్ మార్చకూడదని, కానీ విజయరమణారావు ఇందుకు భిన్నంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విదేశీ బ్యాంకుల్లో డబ్బును కూడబెట్టి, వ్యాపారం చేసి వాటి మీద వచ్చిన డబ్బును హవాల ద్వారా తెప్పించి వినియోగించిన పాన్ కార్డును బయటపడేశారని ఆరోపించారు. కొత్త కార్డు తీసుకొని ఇన్‌కంట్యాక్స్ అధికారులను తప్పుదోవపట్టించారని విమర్శించారు. గతేడాది ప్రభుత్వం ఇచ్చే ఎమ్మెల్యే ఫెన్షన్ పొందుతున్నాడని వివరించారు.
అసెంబ్లీ ఎలక్షన్ ఆఫిడవిట్లో తన పేరుమీద, భార్య పేరున ఉన్నా అన్ని ఆస్తులు చూపలేదని, తన భార్య పేరు మీద దుబ్బాపేట్లో సుమారు 2 ఎకరాల భూమిని 2023 ఆఫిడవిట్లో చూపలేదన్నారు.
19-8-2021రోజున ఓసీబీసీ అనే హాంకాంగ్ బ్యాంక్ నుంచి ప్రభాకరన్ వేణు అకౌంట్ నంబర్ 5000975813 నుంచి విజయ రమణారావు ఖాతా నంబర్ 74006826332కు రూ.40 లక్షల 50వేలు సింగపూర్ డాలర్లు మార్పిడి జరిగినట్లు బ్యాంక్ ఇచ్చిన లేటర్ ఉన్నదని తెలిపారు. ఆయనకు దమ్ముంటే విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లపైన చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈడీ విచారణ చేపట్టక ముందే పెద్దపల్లి ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో ఢీల్లీకి వెల్లి హోంశాఖ, ఈడీకి ఫిర్యాదు చేయడంతో పాటు దేశంలో పేరున్న ఆడిటర్‌తో విదేశీ అకౌంట్ల వివరాలు సేకరిస్తామని చెప్పారు.