తుంగతుర్తి, నవంబర్ 20: ఓటుకు నోటు కేసులో పట్టుబడి జైలుకెళ్లిన రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా అన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టిన ఏ సభలోనైనా కేసీఆర్‌ను తిట్టకుండా ఉన్నారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో లేకుండా చేస్తానని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ మహావృక్షం అని, పీకే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదని స్పష్టంచేశారు.