HYDRAA | మొయినాబాద్, సెప్టెంబర్ 8 : కొందరు ప్రముఖులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ నిర్మాణాలను సొంతంగా కూల్చివేసుకుంటున్నారు. అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపట్టక ముందే ఓ మాజీ మంత్రి తన షెడ్‌ను, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యనేత ఫామ్‌హౌస్ ప్రహరీని స్వచ్ఛందంగా తొలగించారు. ఇదే బాటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్న వారు స్వచ్చంధంగా కూల్చివేసుకుంటారా? లేక హైడ్రానే కూల్చివేస్తుందా అనే చర్చ జరుగుతున్నది.