హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో కొడుకును ఎం దుకు దాచి పెట్టాడో సమాధానం చెప్పకుండా కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి విమర్శించారు. కన్న కొడుకును సన్మార్గంలో పెట్టలేని బండి.. మ రొకరి కుటుంబంపై అవాకులుచెవాకులు పేలడం రాజకీయ దివాళాకోరు తనమే అవుతుందని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఒకవైపు పోలీసులు భగీరథను తామే అరెస్ట్ చేశామని చెప్తుంటే.. ‘నేనే పోలీసులకు అప్పగించా’ అని సంజయ్ అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ, పారిశ్రామికరంగాల్లో తెలంగాణకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన కేటీఆర్‌పై విమర్శలు చేయడం బండి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం సాధించారో సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘భావోద్వేగ రాజకీయాలు, డ్రామాలతో ప్రజలను ఎల్లప్పు డూ మోసం చేయలేరు. కేంద్ర మంత్రిగా మీ పనితీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీ దివాళాకోరుతనానికి, మీ అహంకారానికి తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధిచెప్తారు’ అని హెచ్చరించారు.