నిజామాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌కు సిట్ నోటీసు జారీ చేయడంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలు సహించబోరని ఆయన అన్నారు. సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తన స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను వేల్పూర్‌లో దగ్ధం చేశారు.
ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందు సిట్లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని మండిపడ్డారు.