సీఎం రేవంత్ రెడ్డి ధోరణితో లక్షలాది మంది విద్యకు దూరం
సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.
- మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర మండిపాటు
కాచిగూడ, ఏప్రిల్ 28: సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మంగళవారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రను రేవంత్ ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కా కపోవడంతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12.50 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెలించిందని గుర్తుచేశారు. ఈనెల 30న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కోర్టులో వాదనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడం హస్యాస్పదమని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే కౌంటర్ దాఖలు చేయడంలేదని ఆరోపించారు. తక్షణమే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్‌చేశారు. లేకుంటే విద్యార్థుల తరుఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

