హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని తెలంగాణ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆలిండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్రం త్వరలో చేపట్టే జనాభా లెక్కల్లో కులగణన చేర్చాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థ, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని, ఓబీసీ సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.