కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ఎండిన పంటలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి గుడిపల్లి వరకు సాగునీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పదేండ్లు అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని వంద రోజుల్లోనే కాంగ్రెస్ భ్రష్ఠుపట్టించిందని విమర్శించారు. ఇగురం లేని పాలన చేసి రైతులకు నీరందకుండా చేశారని, పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోయామని ప్రజలు, రైతులు బాధపడుతున్నారని అన్నారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

