హైదరాబాద్ : ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయ వాదం అని, ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు అవుతారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ వాదంపై అక్కసు వెళ్లగిక్కిన నేపథ్యంలో నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ పౌర సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాచరికపు పాలన పోయి తెలంగాణ దేశంలో విలీనం కావాలని పోరాటం చేసిన జాతీయ వాదులు మా తెలంగాణ ప్రజలు అని గుర్తు చేశారు.
మమ్మల్ని బలవంతంగా ఆంధ్రా ప్రాంతంతో విలీనం చేసిని విషయాన్ని గుర్తు చేశారు. నాడు మీ దుర్మార్గాల నుంచి విడిపోవాలని పోరాడారు తప్ప తెలంగాణ ప్రజలు ప్రాంతీయవాదులు కాదని స్పష్టం చేశారు. పక్కా రాష్ట్రాల వాళ్లు వచ్చి మనల్ని వెక్కిరిస్తుంటే మౌనంగా చూస్తున్న రేవంత్ రెడ్డి పెద్ద ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన విధంగా మిగతా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
నీ నోళ్లకు పక్షవాతం వచ్చిందా అని ప్రశ్నించారు. అధికార పక్షం, ప్రతి పక్షం విషయంలో ఎన్నో విభేదాలు ఉండొచ్చు. కానీ, తెలంగాణకు అవమానం జరుగుతుంటే అందరు ఏకతాటి పైకి వచ్చి మాట్లాడకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చే స్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు అవుతారు
రాచరికపు పాలన పోయి తెలంగాణ దేశంలో విలీనం కావాలని పోరాటం చేసిన జాతీయ వాదులు మా తెలంగాణ ప్రజలు
మమ్మల్ని బలవంతంగా ఆంధ్రా ప్రాంతంతో విలీనం చేశారని, విడిపోవాలని పోరాడారు తప్ప మా ప్రజలు ప్రాంతీయవాదులు కాదు
పక్కా రాష్ట్రాల వాళ్లు… https://t.co/clpkT3CUpf pic.twitter.com/zUzkG4CfYL
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026