హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా రా ష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలైన హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డి మాండ్ చేశారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులా? అని నిప్పులు చెరిగారు. పాలనలో లోపాలను ఎత్తిచూపినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించేందుకు వెళ్లినా, ప్రభు త్వం భూములు లాక్కుంటుంటే ఇదేమిటని ప్రశ్నించినా, కూల్చుతున్న ఇండ్లకు అడ్డొచ్చి నా, ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసి నా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడమేనా మీ పాలన? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాసు లు మీకు – కేసులు మాకు, సూట్‌కేసులు మీకు.. అరెస్టులు మాకు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, ఎమర్జెన్సీని తలపిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రభుత్వానికి ఫిర్యాదు తీసుకునే ధైర్యం లేదా? అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నా ఏసీపీ అందుబాటులో ఉండకపోవడం, ఉన్న సీఐ ఎమ్మెల్యేను చూసి ఫిర్యాదును స్వీకరించుకుండా వెళ్లిపోపోవాలనుకోవడం వంటి పరిణామాలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫిర్యాదును తీసుకోకుండా ఉల్టా ఎమ్మెల్యేపైనే కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి అకారణంగా కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేస్తున్నారంటూ వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరె స్టు చేసి దౌర్జన్యానికి ఒడిగట్టారని విమర్శించారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే, ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేలపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు సమయం అయిపోయేదాకా కాలక్షేపం చేసి నేతలను జైళ్లో పెట్టాలన్న కక్ష ప్రభుత్వానికి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు.
అరెస్టులతో రాష్ట్రం ఆగం: జూలూరు
పునర్నిర్మాణం జరగాల్సిన సమయంలో పాలకుల విపరీత ధోరణితో తెలంగాణ తల్లడిల్లుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ స భ్యుడు జూలూరీ గౌరీశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. అరెస్టులు, దాడులు, లగచర్ల ఘట న, హరీశ్‌రావు అరెస్టులతో ఆగమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం పాలన, ఇవేం అరెస్టులు, ఇదేనా ప్రజాపాలన అని ప్రజలు నిట్టూరుస్తున్నారని పేర్కొన్నారు.
అరెస్టులు దుర్మార్గం: వై సతీశ్‌రెడ్డి
‘ఉల్టా చోర్ కో త్వాల్ కో డాంటే’ అ న్నట్టుగా కాంగ్రెస్ పా లనలో పోలీసుల తీ రు ఉన్నదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపైనే పోలీసులు కేసు నమోదు చే యడం, అరెస్టు చేయడం దుర్మార్గమని పే ర్కొన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ అకడికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రా వు, జగదీశ్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తెలిపారు.
రజాకార్ రాజ్యం: రాంబల్ నాయక్
ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో తిరిగి నయా రజాకార్ రాజ్యం నడుస్తున్నదని రాష్ట్ర లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సహా ఇతర నేతలను కక్షపూరితంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులపైనే పోలీసులు ఈస్థాయిలో జులుం ప్రదర్శిస్తే సామాన్యులపై ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చ రిం చారు. అక్రమ అరెస్టులను ఇకనైనా ఆపాల ని, కక్షసాధింపు చర్యలతో ప్రశ్నించే గొంతులను నిలువరించలేరని తెలిపారు.
గుణపాఠం తప్పదు: రసమయి
కాంగ్రెస్ నిర్బంధ పాలనకు ప్రజలే గుణపాఠం చెప్తారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చే శారు. ప్రభుత్వ అసమర్థ వైఖరిని ప్ర శ్నిస్తే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించడం, కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో హరీశ్‌రావును కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రభుత్వ తీరుపై రసమయి నిప్పులు చెరిగారు.
అంతులేని హింస : జీవన్‌రెడ్డి
తెలంగాణలో పోలీస్ రా జ్యం కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించా రు. ఇందిరమ్మ రాజ్యమంటే అంతులేని హింస అని చెప్పారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐని ప్రశ్నించినందు కు పాడి కౌశిక్రెడ్డిపైనే కేసులు పెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు.అరెస్టులతో అణచివేయలేరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పతనమే: తాతా మధు
హామీలను తుం గలో తొకి ప్రజా వ్య తిరేకతకు మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ పతనం మొదలైందని ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. పాలన చేతగాక ప్రశ్నించేవారిపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడమే పాలనా? అని ప్రశ్నించారు. ప్రజాపాలన అని చెప్తూ ప్రజాగొంతుకలను నొక్కుతున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగోక్కోవద్దని హెచ్చరించారు.
ఫిర్యాదు చేస్తే కేసా? : నిరంజన్‌రెడ్డి
పోలీసులు ఎందు కు అత్యుత్సా హం ప్ర దర్శిస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే అనుమ తి తీసుకొని ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఏసీపీ లేకపోవడం, ఉన్న సీఐ ఎమ్మెల్యే రాకను గ మనించి ఫిర్యాదు స్వీకరణను నిరాకరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఫిర్యాదును స్వీకరించకపోగా తమ విధులకు ఆటంకం కలిగించారని, తమపై దురుసుగా ప్రవర్తించారని కేసులు పెట్టడం వెనుక ప్రభుత్వం ఒత్తిడి ఉన్నట్టు స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు.
నిర్బంధం సాగదు : శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహా నేతల అరెస్టులు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన ఎంతోకాలం సాగదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలనా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు.
ప్రతిపక్షాల గొంతునొక్కే యత్నం: కొప్పుల ఈశ్వర్
జగిత్యాల, డిసెంబర్ 5: ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఖండించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. హామీలను నెరవేర్చాలని అడిగితే కేసులు నమెదు చేస్తారా? అని నిలదీశారు. పోలీసులను ముందు పెట్టుకొని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తున్నదని విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపైనే కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై కేసులు పెట్టారని, కేటీఆర్‌పైనా కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
హకుల ఉల్లంఘన: సుంకె
గంగాధర, డిసెంబర్ 5: రేవంత్‌రెడ్డి సర్కారు రాజ్యంగాన్ని ఉల్లంఘిస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డిపై అక్రమ కేసులు, హరీశ్, జగదీశ్‌రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతల అరెస్టులను ఖండించారు. రాష్ట్రంలో పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాన్ని భరించలేకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు.
అరాచక పాలన: రవీందర్
మహబూబాబాద్, డిసెంబర్5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుచేతిలో తెలంగాణను పెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. మహబూబాబాద్క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల మీద అక్రమ కేసులు పెడుతూ రేవంత్‌రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తదితర నాయకుల అరెస్టులను ఖండించారు.
కాంగ్రెస్‌ది పాశవిక చర్య: బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ పాశవిక చర్యలు పరాకాష్ఠకు చేరాయని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అగౌరవపర్చడమే కాకుండా ఆయనపైనే కేసు నమోదు చేయడం చూస్తుంటే రేవంత్‌రెడ్డి పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని అర్థమవుతందని తెలిపారు. కౌశిక్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన నేతలను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కౌన్సిలర్ తాహేర్ పాల్గొన్నారు.
కక్షసాధింపు: రవీంద్రకుమార్
చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 5: హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీ ఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. దేవరకొండలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ, కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు అదిరేది లేదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
నిర్బంధ పాలన: చిరుమర్తి
చిట్యాల, డిసెంబర్ 5: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. నల్లగొం డ జిల్లా చిట్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు కాదని, నిర్బంధ పాలనకు ఏడాది పేర ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేక పాలనపై నిరసన చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్బంధిస్తూ రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు 11 నెలలకే విసుగెత్తారని తెలిపారు.