హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఒక అద్భుతమైన క్షణాన్ని బం ధించేదే ఫొటో అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి క్లిక్‌తో ప్రపంచ హృద య స్పందనను సంగ్రహించే ఫొటోగ్రాఫర్లు, ఫొటోజర్నలిస్టులకు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మంగళవారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక కథను చెప్పే సామర్థ్యం కూడా ఫొటోకు ఉంటుందని తెలిపారు. వారి కష్టం, నైపుణ్యం ద్వారా ప్రపంచ ఆనందాలు, విషాదాలు, జీవిత కథనాలను చూస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా బస్తాల కోసం జోరువానలో బారులు తీరిన రైతులను చూస్తే గుండె తరుక్కుపోతున్నదని పేర్కొన్నారు. ‘జోరు వానలో బారులు తీరాలే.. బస్తా యూరియా కోసం బోరున ఏడవాలే.. కాంగ్రెస్ పాలనలో రైతన్నా.. నీకు కన్నీరే మిగిలింది రైతన్నా’ అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.