హనుమకొండ చౌరస్తా, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బతికుంటే తెలుగుజాతి ఆత్మగౌరవం ఢిల్లీ గడపల్లో తాకట్టు పడేది కాదని మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ జంక్షన్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల హక్కులపై కేంద్రం ఈ స్థాయిలో దౌర్జన్యం చేయగలిగేది కాదన్నారు.
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను అరిగోసలు పెడుతుంటే పేద ప్రజల కోసం, రైతుల కోసం రుణాలను మాఫీ చేసి నూతన మండలాలను ఏర్పాటు చేసి ఎంతో కృషి చేశారని అన్నారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశాడని, దేశంలోనే ఏ రాష్ర్టంలోలేని విధంగా వృద్ధులకు పెన్షన్ ఇచ్చే పథకం ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రాంతీయ పార్టీని జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన చరిత్ర ఆయనదేనన్నారు.