హనుమకొండ, మే 21: వడ్లకు బోనస్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ధాన్యాన్ని రూ.500 బోనస్‌తో కొనుగోలు చేస్తామని అసెం బ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి నేడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం హనుమకొండలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లు పండిస్తారని, ఇంటి అవసరాల కోసం మాత్రమే సన్నవడ్లు సాగు చేస్తారని చెప్పారు. కేవలం 20 శాతం మేరకు సాగు అయ్యే సన్న ధాన్యానికి బోనస్ ఇచ్చి దొడ్డు వడ్లకు ఇవ్వం అంటే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్లేనని ఎర్రబెల్లి ఆరోపించారు.