హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) సవాల్ ( Challenges ) విసిరారు.రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగి ఉంటే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నువ్వు సిద్ధమా. అంటూ ఛాలెంజ్ చేశారు.
గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. రూ.50వేల కోట్ల రుణమాఫీ చేస్తామని కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే ఇప్పటివరకు మాఫీ చేశారని వెల్లడించారు. రుణమాఫీపై ఇచ్చిన హామీ గురించి, రేవంత్‌రెడ్డి రుణమాఫీ ఎందు చేయడం లేదని రాహుల్‌గాంధీని ప్రశ్నిస్తున్నామని అందులో తప్పేమిలేదని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌తోనే పదేళ్ల పాటు రైతన్నలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. 2009 నుంచి కేటీఆర్ అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడుతున్నారని, పది సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరొందిన వ్యక్తని ప్రశంసించారు. జాతీయ మీడియా కూడా కేటీఆర్‌ను జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తించిందని వివరించారు.
కేటీఆర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒక్కసారైనా ఎమ్మెల్యేగా మహేష్‌కుమార్ గెలవలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మెప్పుకోసం అడ్డగోలుగా, పీసీసీ స్థాయిని మరిచిపోయి , ధనం, అధికార అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. నీచస్థాయి మాటలు మాట్లాడితే తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.