మంథని, ఫిబ్రవరి 3: మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన రాంరెడ్డి కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాంరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సంతాపం వ్యక్తం చేశారు. రాంరెడ్డి సుధీర్ఘకాలంపాటు ఖమ్మంపల్లి సర్పంచ్‌గా, ముత్తారం ఎంపీపీగా పని చేశారు.
టీడీపీలో చేరిన ఆయన 1994లో అప్పటి స్పీకర్ శ్రీపాదరావుపై విజయం సాధించి 1999 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అ నంతరం బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్య మ సమయంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రసాధన కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలను మంథనిలో చేపట్టారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు సునీల్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.