హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు.
పలు రాష్ట్రాలకు చెందిన నాయకులతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామితో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. జాతీయ నాయకులతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించడం దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Former Gujarat Chief Minister and former Union Minister Sri @ShankersinhBapu met with Chief Minister Sri K. Chandrashekar Rao at Pragathi Bhavan today. pic.twitter.com/KLBWpO53PX
— Telangana CMO (@TelanganaCMO) September 16, 2022