హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ వాల్యానాయక్ దంపతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బుధవారం కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయనను కలిసి తన కుమారుడు అరుణ్‌కుమార్ వివాహ ఆహ్వాన పత్రికను వారు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తండాబాట కార్యక్రమం సందర్భంగా కేసీఆర్ వాల్యానాయక్ నివాసంలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న హయత్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాలులో వివాహం, శంషాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా వాల్యానాయక్ కేసీఆర్‌కు వివరించారు. వాల్యానాయక్ వెంట మాజీ ఎంపీపీ కమల, ఆయన కుటుంబసభ్యులు జేవేందర్, ఆనంద్‌నాయక్, అరుణకుమార్, అనిత ఉన్నారు.
సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి: సీఎస్
హైదరాబాద్,ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కలెక్టర్లు పటిష్ఠమైన నిఘా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యా ధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను, స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ ప్రగతిని సమీక్షించారు. కలెక్టర్లతోపాటు జిల్లాలోని ఇత ర ఉన్నతాధికారులు అన్ని పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు సోకే జ్వరాల నివారణకు సకాలంలో స్పందించాలని, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆహారం, పారిశుధ్యాన్ని కూడా తనిఖీ చేయాలని తెలిపారు.